తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో మకాం వేసి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.  రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డిలు ఇప్పటికే రామ్ మాధవ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.  

వీరిద్దరి తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు రామ్ మాధవ్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.  తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో పాటు... తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడంతో వీటికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని చూస్తోంది.  దానికి తగ్గట్టుగా పావులు కదుపుతోంది.  

తెరాస పై ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలే నిదర్శనం.  నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో పాటు, నిజామాబాద్ లో కవితను ఓడించింది బీజేపీ. దీనిని బేస్ చేసుకొని తెలంగాణాలో ఎదగాలని చూస్తోంది. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డిలు కనుక బీజేపీలోకి వస్తే.. వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.  

వీరితో పాటు తెరాస కు చెందిన కొంతమందిని పార్టీలోకి తీసుకురావాలని, అలా తెరాస నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు కొన్ని పదవులు కట్టబెట్టాలని పార్టీ చూస్తోంది.  ఇది సాధ్యమయ్యి పార్టీ బలపడితే.. వచ్చే ఎన్నికల్లో తెరాస కు తప్పకుండా మంచి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: