Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:41 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : చంద్రబాబుకు కరెక్టు మొగుడు దొరికాడు

ఎడిటోరియల్ : చంద్రబాబుకు కరెక్టు మొగుడు దొరికాడు
ఎడిటోరియల్ : చంద్రబాబుకు కరెక్టు మొగుడు దొరికాడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజధాని ప్రాంతమైన సిఆర్డీఏ కి ఛైర్మన్ గా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే చంద్రబాబునాయుడుకు సరైన మొగుడును జగన్ రంగంలోకి దింపినట్లే భావించాలి.  ఎందుకంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ ముసుగులో చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని జగన్ ఎన్నోసార్లు ఆరోపించారు. అదంతా బయటకు రావాలంటే ఆళ్ళే సరైన వ్యక్తి.

 

ఎందుకంటే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళెవరైనా ఉన్నారంటే అది ఆళ్ళ  మాత్రమే. ఇక్కడే చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు అందరికీ తెలిసిందే.

 

అంతర్జాతీయ రాజధాని అంటూ చంద్రబాబు ఐదేళ్ళు ఒకటే ఊదరగొట్టిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణం పేరుతో  చంద్రబాబు వేల రైతుల నోళ్ళు కొట్టి సుమారు 40 వేల ఎకరాలు సేకరించారు. ఇందులో ఇష్టపూర్వకంగా భూములిచ్చిన రైతులు కొంతమందే. మిగిలిన రైతుల భూములను చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంది.

 

ఇక్కడే ఆళ్ళ సీన్ లోకి ఎంటరయ్యారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున ఆళ్ళ కోర్టుల్లో కేసులు వేశారు.  బలవంతపు భూ సేకరణను నిలిపేయాల్సిందిగా కోర్టు స్టేలు కూడా ఇచ్చింది. దాంతోనే చంద్రబాబు బలవంతపు భూ సేకరణకు బ్రేకులు పడ్డాయి.

 

అంతే కాకుండా మంగళగిరిలోని వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి సత్రం భూములను కారు చౌకగా కొట్టేయటానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ను కూడా ఆళ్ళే అడ్డుకున్నారు. ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబును సుప్రింకోర్టుకు లాగింది ఆళ్ళే అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

 

ఐదేళ్ళ పాలనలో చంద్రబాబుకు  నిర్ణయాలకు వ్యతిరేకంగా వివిధ కోర్టుల్లో ఆళ్ళ సుమారుగా 40 కేసులు దాకా వేసుంటారు. అందులో కొన్ని గెలవగా మరికొన్ని కేసుల్లో కోర్టులో స్టేలు ఇచ్చాయి.  మొత్తం మీద ఐదేళ్ళల్లో చంద్రబాబును న్యాయస్ధానాల్లో కేసులు వేసి ముప్పు తిప్పలు పెట్టిన ఆళ్ళకే జగన్ సిఆర్డీఏ ఛైర్మన్ ఇవ్వాలని నిర్ణయించటమంటే చంద్రబాబుకు ఇబ్బందే.

 


alla-and-crda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం
అసెంబ్లీ సమావేశల్లో చంద్రబాబు రాద్దాంతం
వైసిపి హయాంలో కూడా యధేచ్చగా ఇసుక అక్రమరవాణా
టిడిపికి గుంటూరులో  బిగ్ షాక్ ?
అడిగి మరీ తిట్టించుకుంటున్నారే !
రోజా మరీ ఇంత స్పీడా ?
జగన్ కు కొత్త తలనొప్పులు
బ్రేకింగ్ న్యూస్ : ఏపికి కొత్త గవర్నర్ : బిశ్వ భూషణ్
టిడిపి మ్యానిఫెస్టో టిష్యు పేపరా ?
టిడిపి ఎంపికి పివిపి షాక్
ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
ఎంఎల్ఏలకు జగన్ సీరియస్ వార్నింగ్
చంద్రబాబు వ్యూహం ఫలిస్తోందా ?
విద్యుత్ కొనుగోళ్ళల్లో భారీ అక్రమాలు  ?
రిసీవ్ చేసుకునేందుకు నేతలు కావాలెను
టిడిపి ’తానా’ సభల్లో మాత్రమే మిగిలిపోతుందా ?
చంద్రబాబునే కేశినేని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
టిడిపిలో ముసలం మొదలైందా ?
చంద్రబాబుకు పెద్ద షాకిచ్చిన  ’కియా’
జగన్ పై పెట్టినవి  కక్షసాధింపు కేసులేనా ?
చంద్రబాబు జైలు జీవితంపై సంచలన వ్యాఖ్యలు
జగన్ సూపర్ స్కెచ్...ఎంఎల్ఏలను ఫిక్స్ చేసేశారు
సంచలనం : బాలకృష్ణ మాజీ పిఏకి మూడేళ్ళు జైలుశిక్ష
ఆ టిడిపి నేతలకు మాత్రం బిజెపిలో ఎంట్రీ లేదట
జార్ఖండ్ సిఎంగా ధోని ?
ఆగిపోయిన ‘వెలుపలి’ మద్దతు..చంద్రబాబులో టెన్షన్
రెండూ సాధించగలిగితే నిజంగానే జగన్ సూపర్
ధర్మవరం ఇక ఆ కుటుంబానిదేనా ?
తాజా బడ్జెట్ పై నోరెత్తలేని టిడిపి
టిడిపి బలం 13 సీట్లకు పడిపోతుందా ?
జగన్ పేరుతో కీలక పథకం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.