పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైంది.  132   స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించడం విశేషం.  రాజోలు నుంచి వరప్రసాదరావు విజయం సాధించారు.  జనసేన పార్టీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.  

ప్రమాణస్వీకారం అనంతరం వరప్రసాదరావు, ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.  ముఖ్యమంత్రి జగన్ ను కలవడంతో జనసేన పార్టీ షాక్ తిన్నది.  అయితే, తాను కేవలం మర్యాద పూర్వకంగానే జగన్ ను కలిశానని వరప్రసాదరావు అంటున్నారు.  లోపల మాత్రం ఆయనకు పార్టీ మారే ఆలోచన ఉందని అంటున్నారు.  

ఒకవేళ పార్టీ మారాలి అనుకుంటే.. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తరువాత వైకాపాలోకి ఎంటర్ కావాలి.  ఈ విషయాన్ని ఇప్పటికే జగన్ పలుమార్లు చెప్పారు.  తనకు ఫిరాయింపుల చట్టం గురించి తెలుసని, అందరిలా తాను ప్రవర్తించడం చేతగాదని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు.  ఎవరైనా కావొచ్చు.. వైకాపాలోకి రావాలంటే ఇలా చేయాల్సిందే.  

అందుకు సిద్దపడి పార్టీ మారాలి అనుకుంటే రాజీనామా చేయాలి.  అప్పుడు రాజోలులో ఉప ఎన్నిక జరుగుతుంది.  అలా జరిగితే... పవన్ రాజోలు నుంచి పోటీ చేయడం ఖాయం.  రాజోలు నుంచి పవన్ పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాడు అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: