దేశ మొదటి పూర్తి ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ ఈసారి బాధ్యతలను చెప్పటారు.ప్రభుత్వం తో పాటు ప్రజలను పాలనలో భాగం చేయడానికి బడ్జెట్ ను రూపొందించడంలో  సామాన్యుల మరియు విశ్లేషకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు.


సామాన్యుల అభిప్రాయాలను సీతారామన్ మరియు ఆవిడ టీమ్ సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు అని సమాచారం. ఫిబ్రవరిలో మధ్యతరగతి మరియు రైతుల పై వరాలు కురిపించిన బీజేపీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో  అని అందరూ ఆలోచనల పడ్డారు.

ప్రస్తుత బడ్జెట్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు అలాగే పన్ను రాయితీలను ఎగుమతులు చేసే సంస్థలకు కల్పించడం ద్వారా మన దేశం లోని ఎగుమతుల రంగానికి ఊతం ఇచ్చిన్నటు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

వచ్చే నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సామాన్యులు, విశ్లేషకులు అందరూ ఎదురుచూస్తున్నారు.మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో సామాన్యుల పై ఎన్ని వరాలను కురిపించనున్నదో వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: