జగన్ అధికారంలోకి వచ్చాక చాలా  వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నాడు.  ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  అదేవిధంగా ప్రమాణస్వీకారం రోజున గ్రామాల్లో వాలంటీర్ల నియామకం చేపడతామని చెప్పిన జగన్, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ఉంటారని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పధకం కూడా వాలంటీర్ ద్వారా ఇంటికి వస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.  

వైఎస్ హయాంలో లాగే, జగన్ కూడా తన మంత్రి వర్గంలో సమన్యాయం పాటిస్తూ మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు.  వైకాపా ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి, పార్టీలో, అసెంబ్లీలో కీలక పాత్ర పోషించిన రోజాకు ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా నియమించారు.  

గ్రామాల్లో నియమించబోయే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్లలో సగం సగానికి సగం మంది మహిళలకు అవకాశం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా జగన్ భరోసా ఇచ్చారు.  ఈ గ్రామ వాలంటీర్ల పథకం అమలయ్యి, మహిళలకు తప్పకుండా అవకాశాలు వస్తే.. జగన్ ను వైఎస్ లా మరో దేవుడిలా కొలవడం ఖాయం.  

అప్పట్లో వైఎస్ ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రజలకు చేరువయ్యారు.  ఈ పధకాలు అమలు కావడం వల్లనే వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చారు.   వీటిని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తుండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: