37 ఏళ్ల తెలుగుదేశం పార్టీ  తన చరిత్రలోనే  అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందిి.  ప్రత్యర్థి   వైసీపీ చేతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.  కేవలం 23 అసెంబ్లీ సీట్లు  గెల్చుకొని  దీని అవస్థ ఎదుర్కొంటోంది.

 

ఓవైపు నాయకుడిగా ఎదగలేని  లోకేష్ అసమర్థత,  మరోవైపు చంద్రబాబు కు పెరుగుతున్న వయోభారం తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.  జగన్ దూకుడు కారణంగా ఇప్పట్లో తెలుగుదేశం కోలుకునే పరిస్థితి లేదు.   ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ కథనం ఆ పార్టీ నేతలను మరింతగా వణికిస్తోంది.

 

ఎనిమిది మంది వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలు ఆ పార్టీ ని కలవరపెడుతున్నాయి.  అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా  కోల్పోతుంది.  వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడైన వైయస్ జగన్  తెలుగుదేశాన్ని అంత సులభంగా  వదిలి పెట్టే అవకాశం లేదు.

 

జగన్ దూకుడు తోడు అటు  బిజెపితో శత్రుత్వం  కూడా చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేసే అవకాశం ఉంది.  ఐటీ దాడులు సీబీఐ కేసులు  చంద్రబాబును వెంటాడే అవకాశం ఉంది.  ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని  చంద్రబాబు తెలుగుదేశాన్ని   ఎలా గట్టెక్కిస్తాడో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: