అదేంటి తెలంగాణకు ఆల్రెడీ అసెంబ్లీ ఉంది కదా అనుకుంటున్నారా..  హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ భవనం కొలువుదీరిన సంగతి తెలిసిందే.  నిజాములు కట్టించిన ఈ భవనం రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది.

 

అయితే ఈ భవనాలు  వందల ఏళ్ల నాటివి కావడంతో..  వాటి స్థానంలో కొత్త అసెంబ్లీ కట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.  కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం   అనువైన స్థలాలను  వెతుకుతోంది.  ప్రస్తుతం ఈ అన్వేషణ  ఓ కొలిక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

ఎర్రమంజిల్ ప్రాంతంలో  తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలు చాలా ఉన్నాయి.  అవి కూడా పాత కాలం నాటివి.  ఈ స్థలం తెలంగాణ కొత్త అసెంబ్లీ భవనాలకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

 

ఈ స్థలం ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లాక ఆయన పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ నెలలోనే తెలంగాణ కొత్త అసెంబ్లీకి కెసిఆర్ శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.  ఈ నెల 27 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో కెసిఆర్ కొత్త అసెంబ్లీ విషయంలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: