టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తను అనుసరించే వ్యూహాలకు ప్రతీతి.ఆయన తీసుకున్న నిర్ణయాలు అనుసరించిన వ్యూహాల వల్లే టీడీపీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది.కాని ఈసారి ఆయన వ్యూహాలకు జగన్ చెక్ పెట్టాడు అందువల్లే ఆయన, టీడీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అవ్వాల్సి వచ్చింది.అలాగే దారుణమైన ఓటమిని చూడాల్సి వచ్చింది.మరి ఇలాంటి సమయంలో బాబు గారు తీసుకున్న ఒక కీలక నిర్ణయం క్యాడర్ ను ఆందోళనకు గురి చేస్తుంది.

మొన్న జరిగిన టీడీఎల్పీ మీటింగ్ లో చంద్రబాబు తనతో గెలిచిన ఎమ్మెల్యేలు తనకంటే అసెంబ్లీలో ఎక్కువగా అధికార పక్షాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు వెనక ఒక పక్కా వ్యూహం ఉందని టీడీపీ వర్గాలు గుస గుసలాడు కుంటున్నాయి.వాటి ప్రకారం చంద్ర బాబు అసెంబ్లీ కి రెండేళ్ళ పాటు దూరం అవ్వనున్నారని సమాచారం.

చంద్ర బాబు వారి ఎమ్మెల్యేలకు ఎంత కర్తవ్యబోధన చేసినా రెండేళ్ళ కాలం లో అసెంబ్లీ లో జగన్ మరియు అతని టీమ్ ని ఆడుకోవడం చంద్రబాబు లేని టీడీపీ కి అసాధ్యం అనే చెప్పాలి.మరి చంద్రబాబు ఈ రెండేళ్ళు అసెంబ్లీ కి రాకుండా ఏం చేయబోతున్నారు అని అడిగితే క్యాడర్ దగ్గర సమాధానం లేదు.

గొప్ప వ్యూహకర్తగా పేరు ఉన్న చంద్రబాబు అసెంబ్లీ కి రెండేళ్ళు రాకూడదు అని తీసుకున్న నిర్ణయం వెనక ఏ వ్యూహాన్ని రచించారో మరి  ఈసారి ఆయన విజయానికి ఉపయోగపడుతుందా అనేది తెలియడం కోసం కొద్ది కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: