జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసిన అవినీతిని, అవకతవకలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన సంగతీ తెలిసిందే. ఏపీ సీఎంగా జగన్ గద్దెనెక్కగానే అన్న మాట.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చేసి పున: సమీక్షిస్తామని.. చంద్రబాబు ప్రభుత్వం ఇందులో అవినీతికి పాల్పడి చీప్ గా వచ్చే యూనిట్ ధరను భారీగా పెంచి సదురు కంపెనీలకు లబ్ధి చేకూర్చిందన్నది జగన్ ఆరోపణ.. అయితే జగన్ ఈ ప్రకటన చేయగానే టీడీపీ అలెర్ట్ అయ్యింది.


సదురు కంపెనీల సాయంతో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శితో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాయించినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఇలా పాత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు రద్దు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని.. దీనివల్ల ఏపీకి పెట్టుబడులు రావని.. పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తారని జగన్ కు సూచించాలని కేంద్ర కార్యదర్శి ఏపీ సీఎస్ కు లేఖలో సూచించారు.. అయితే టీడీపీ లాబీయింగ్ మీదనే సదురు కేంద్ర కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి ఈ లేఖ పంపించినట్టు జగన్ అండ్ కో గుర్తించారట..


అయితే ఈ లేఖను అందుకున్న జగన్ నేరుగా తిరుపతికి వచ్చిన మోడీ వద్దకు తీసుకెళ్లారట.. ఆయనతో రహస్య భేటిలో ఇదే విషయం చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు సర్కారు ముఖ్యంగా పవన్ విద్యుత్ విషయంలో రూపాయికి యూనిట్ వచ్చే విద్యుత్ ను రూ.5, రూ.6 వరకు పెంచి టీడీపీ అనుకూల కంపెనీలకు దోచిపెడుతోందని.. దీన్ని రద్దు చేస్తానని అంటే మీ కేంద్ర కార్యదర్శి లేఖ రాశాడని ఆ లేఖను మోడీకి చూపించాడట.. దీంతో చంద్రబాబు అంటేనే పీకల్లోతూ కోపంగా ఉన్న మోడీ.. ‘నేను చూసుకుంటూ.. నువ్వు విద్యుత్ కొనుగోళ్లు రద్దు చేసి తాజాగా మళ్లీ ఓపెన్ టెండర్లు పిలువు..దీనిపై విచారణ కమిటీ వేయి’ అని జగన్ కు సూచించినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: