ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బాబు టార్గెట్ మారింది.  అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉన్నది కాబట్టి.. తమ క్యాడర్ ను, పార్టీని బలోపేతం చేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు.  కార్యకర్తలపై దాడులు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగత్తలపై దృష్టి సారించారు.  
త్వరలోనే ఏపీలో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరవడంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో టీడీపీ తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకు

సంబందించిన ప్రణాళికలను చంద్రబాబు సిద్ధం చేసుకున్నాడు కూడా… పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ముందు లాంటి ఎనేర్జిని నింపేందుకు నేడు ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ వన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహిం చనుంది.  

ఈ వర్క్ షాప్ లో పార్టీ శ్రేణులు ఎలా ఉండాలి.  ఒకవేళ వైకాపా నుంచి దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలి.. పార్టీ బలం తగ్గకుండా చూసుకోవడం ఎలా.. అనే అంశాలపై ఈరోజు బాబు నాయకులతో చర్చించనున్నారు.   అలాగే గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించనున్నారు.  

బాబు టార్గెట్ మాత్రం ప్రాదేశిక ఎన్నికలే.  ఆ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలు గెలుచుగలిగితే అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి ఇంకాస్త బలం చేకూరుతుంది.  సంస్థాగతంగా తాము బలంగా ఉన్నామని చెప్పేందుకు వీలు కలుగుతుంది అన్నది బాబు ఆశ. 


మరింత సమాచారం తెలుసుకోండి: