వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి, కేసీయార్ తెలంగాణా సీఎం. ఇద్దరూ మంచి దోస్తులు. ఎవరి రాష్ట్రాల్లో వారు పాలించుకుంటున్నారు. ఆరు నెలల తేడాతో ఇద్దరూ బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చారు. తెలుగు రాష్ట్రాలు సఖ్యంగా ఉన్నాయి.


మరి ఈ పరిస్థితుల్లో జగన్ కేసీయార్ కి షాక్ ఇవ్వడమేంటి. అంటే అక్కడే కధ ఉంది. జగన్ ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా చేసిన ప్రసంగ తెలంగాణాలో బాగా వైరల్ అవుతోందట. తాను ఫిరాయింపులు ప్రోత్సహించనని, ఎట్టి పరిస్థితుల్లో గోడ దూకిన వారిపైన వేటు వేయాలని జగన్ చెప్పిన మాటలు కేసీఅర్ కి చెంపపెట్టు అంటున్నారు అక్కడ కాంగ్రెస్ నాయకులు


తమ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుని కేసీయార్ ఫిరాయింపులను బాగా ముందుకుతీసుకెళ్తున్నారని, యువకుడైన జగన్ని చూసి కేసీయార్ తన తప్పుడు విధానాలు మానుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. మరి ఈ తీరు చూస్తుంటే దోస్త్ అని జగన్ని అనుకుంటే కేసీయార్ కే షాక్ ఇచ్చేశాడని అంటున్నారు. బాబుతో సహా ఎవరైతే ఫిరాయింపులకు తెగబడతారో వారందరికీ కూడా ఇదొక గుణపాఠం కావాలని కూదా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: