ఏపీకి కొత్త సీఎం, యువకుడు అయిన జగన్ పై ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ కి తాజా ఎన్నికల్లో వచ్చిన సీట్లూ, ఓట్లే అందుకు ఉదాహరణ. ఏపీని జగన్ ఆదుకుంటాడని, అభివ్రుధ్ధిపధంలో నడిపిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు.


ఈ నేపధ్యంలో జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా జగన్ చెసతున్న మొదటి హస్తిన టూర్ ఇది. జగన్ ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అవుతారని అంటున్నారు. ఈ భేటీ పైన కూడా సర్వత్రా  అసక్తి నెలకొంది. ఏపీలో వైసీపీని దువ్వుతున్న బీజేపీ జగన్ని ఎన్డీయే కూటమిలో చేరమంటోంది. 


ఇక లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తుందని కూడా కధనాలు వస్తున్నాయి. జగన్ మాత్రం ఏమీ తేల్చడంలేదు. ఇపుడు షాతో భేటీలో జగన్ డెసిషన్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ గట్టి పట్టుదలగా జగన్ ఉన్నారు. రేపు జరిగే  నీతి అయోగ్ సమావేశంతో ఇదే విషయమై జగన్ పట్టుబట్ట‌నున్నారు.


ఇంకోవైపు ఏపీకి సంబంధించిన విభజన హామీలు, నిధులు వంటి వాటి విషయంలో కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఏపీకి అన్నీ తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది. ఆయన రాజకీయం కూడా అందరికీ షాక్ ఇచ్చేలా ఊంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: