వైఎస్ ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజుల్లో కొణతాల ఓ వెలుగు వెలిగారు.  ఒక్క కొణతాలే కాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆ పార్టీలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.  2009 లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత.. పరిస్థితులు మారిపోయాయి.  కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.  

కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది కాబట్టి ఈ నేతలకు పెద్దగా ఇబ్బంది రాలేదు.  ఎప్పుడైతే 2014లో రాష్ట్రం డివైడ్ అయ్యిందో.. కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.  ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది.  

సరే.. 2014 అంటే విభజన సమయం కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది.  అందుకే అలా జరిగింది అనుకోవచ్చు.  కానీ, 2019 లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేదు.  దీంతో పరిస్థితులు మారిపోయాయి.  అంచనాలు తప్పిపోయాయి.  చాలా మంది వైకాపాలో జాయిన్ అయ్యారు.  

అయినప్పటికీ కొందరిని పార్టీ పట్టించుకోలేదు.  ఇలాంటి వ్యక్తుల్లో సాయి ప్రతాప్ ఒకరు.  సాయి ప్రతాప్ రాజంపేట నియోజక వర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు.  2014 లో మొదటిసారి ఓడిపోయారు.  ఆ తరువాత వైకాపా వైపు చూసిన జగన్ పట్టించుకోలేదు.  అందుకే ఇప్పుడు కొణతాల తీసుకున్న నిర్ణయాన్నే సాయి ప్రతాప్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: