ఏపిలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం భవిష్యత్ లో మంచి పరిపాలన అందిస్తుందని..ప్రజల మెప్పు పొందుతుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు ఏపి అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగంలో తెలిపారు.  ఉదయం 9 గంటలకు మూడోరోజు సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.  మొదట ఏపిలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.  


ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని, ఎక్కడా ఎటువంటి అవకతవకలకు తావు ఉండదని పేర్కొన్నారు. లోపాయికారీ ఒప్పందాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, అవి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్‌లో పెడతామని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజల ముందుకు తీసుకొస్తామని, వాటి అమలులో జాతి, కులమత భేదాలకు తావుండదని గవర్నర్ స్పష్టం చేశారు.


రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బోరు వావులు వేయిస్తాం. దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడే వారికి రూ.10 వేల పెన్షన్,ఆశా వర్కర్లకు 3 వేల నుంచి 10 వేలకు పెంచాం.  దశలవారీగా మద్యపానం నిషేదిస్తాం. అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు, 4 విడతల్లో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, రూ.5 వేల గౌరవ వేతనం.   


ప్రజలు ఈ ప్రభుత్వంపై పెట్టుకొని గెలిపించినందుకు సదా వారి సేవకోసం అప్రమత్తంగా ఉంటారని.. ప్రభుత్వ టెండర్లలో అవినీతికి తావులేకుండా, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈ కమిషన్ పరిశీలించి టెండర్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.  పక్షపాత వైఖరి లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అభివృద్ది సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: