2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ట్యాంపరింగ్ జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ఈవీయంలు వద్దు బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్ నిర్వహించాలని దేశమంతా తిరిగి నానా హైరానా పడిన చంద్రబాబు తీరా ఈవీయం‌లతో పోలింగ్ ముగిసాక ట్యాంపరింగ్ జరిగిందటూ నెత్తి నోరు బాదుకున్నాడు.

కనీసం నియోజకవర్గానికి 50 వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీం  కోర్టుకు వెళితే...జడ్జీలు చంద్రబాబుకు గడ్డి పెట్టి..కేవలం 5 వీవీ ప్యాట్లు లెక్కిస్తే సరిపోద్దని తేల్చి చెప్పారు. అయినా పోలింగ్ ముగిసాక ఒక నియోజకవర్గంలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ దేశంలోని 22 పార్టీలను కూడగట్టి...మళ్లీ సుప్రీంకోర్టుకు పెడితే జడ్జీల బెంచ్ నానా తిట్లు తిట్టి...ఇదివరకే చెప్పాం కదా...నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్లు లెక్కిస్తే సరిపోద్దని, మళ్లీ ఎందుకు వచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. అయినా చంద్రబాబు, టీడీపీ నేతలు ఏపీలో జగన్, మోదీ కుమ్మక్కై ట్యాంపరింగ్ వల్ల గెలిచారంటూ సన్నాయినొక్కులు నొక్కుతూనే ఉన్నారు. 


తాజాగా ఈవీయంలు ట్యాంపరింగ్ అంటూ మా నాయకుడు చంద్రబాబు నానా యాగీ చేశారని అది ఎంత మాత్రం సరికాదని - టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటే అస్సలు నమ్మనని అంటూ ఆ సీనియర్ నేత చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ నేత ఎవరంటే...పాపం చంద్రబాబు మంత్రిపదవి ఇస్తానంటే అధికారం కోసం ఆశపడి, తనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జగన్‌కు నమ్మకద్రోహం చేసి టీడీపీలో చేరిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే...జ్యోతుల నెహ్రూ. ఆఖరికి మంత్రిపదవి రాక..చంద్రబాబు చేతిలో కరివేపాకులా తీసివేయబడ్డారు..ఈ జ్యోతుల నెహ్రూ.   


2019 సార్వత్రిక ఎన్నికల్లో తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జగ్గంపేట నుంచే పోటీ చేసి తన సోదరుడి కుమారుడు జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికలు అయ్యాక ఇంతవరకూ సైలెంట్‌గా ఉన్న జ్యోతుల నెహ్రూ..తాజాగా ఈవీయంలపై స్పందించారు.  జగ్గంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ...ఈ ఎన్నికల్లో ఈవీయంలు ట్యాంపరింగ్ అయ్యాయంటూ మా నాయకుడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అసమంజసం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈవీయంల ట్యాంపరింగ్‌ను నేను అసలు నమ్మనని,. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే..వైసీపీ రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిందని..మా పార్టీకి ఘోర పరాజయం దక్కిందని,  ఈవీయంల ట్యాంపరింగ్ అనేది అబద్ధం అంటూ జ్యోతుల నెహ్రూ కుండబద్ధలు కొట్టారు.  ఓ వైపు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలంతా నెత్తీ, నోరు బాదుకుంటుంటే.. జ్యోతుల నెహ్రూ మాత్రం అబ్బే ట్యాంపరింగ్ అనేదే లేదు..అంతా మా వాళ్లు చేస్తున్న అసత్య ప్రచారమే అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.  మొత్తానికి ట్యాంపరింగ్ జరుగలేదంటూ జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తలెత్తుకోలేని పరిస్థితులు తీసుకువచ్చాయనడంలో సందేహం లేదు.  మరి జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: