ఫిరాయింపులపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన తెలుగుదేశంపార్టీలో కలకలం రేపుతోంది.  దాని తర్వాత రాజమండ్రి రూరల్ టిడిపి ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి ప్రకటనతో టిడిపి ఎంఎల్ఏల్లో గందరగోళం మరింత పెరిగింది. జగన్ ప్రకటన నేపధ్యంలో గెలిచిన 23 మంది ఎంఎల్ఏలపై పార్టీ పరంగా చంద్రబాబు నిఘా ఉంచినట్లు సమాచారం.

 

ఆ విషయాన్ని పక్కన పెడితే పార్టీలో తమకు 5 గురు ఎంఎల్ఏలే మిగిలినా ప్రజల తరపున పోరాటాలు మాత్రం ఆపేది లేదని బుచ్చయ్య చౌదరి చెప్పటం గమనార్హం. ఓ టివి చర్చా కార్యక్రమంలో బుచ్చయ్య మాట్లాడుతూ తమకు ఐదుగురు ఎంఎల్ఏలు మాత్రమే మిగిలినా నష్టం ఏమీ లేదన్నారు. ఉన్న ఐదుగురితోనే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామంటూ చెప్పారు.

 

బుచ్చయ్య చేసిన ప్రకటనతో టిడిపిలోనే ఉండిపోయే  ఆ 5 గురు ఎంఎల్ఏలు ఎవరా అనే చర్చ ఊపందుకుంది. బుచ్చయ్య యాధాలాపంగా 5 గురు అన్నారో లేకపోతే తమకు మిగిలేది 5 గురు మాత్రమే అనే సమచారంతోనే అన్నారో మాత్రం తెలియటం లేదు. మొత్తం బుచ్చయ్య చెప్పినట్లుగా ఆ 5 గురు ఎంఎల్ఏలు ఎవరనే విషయంలో మాత్రం పార్టీలో చర్చ మొదలైంది.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 5 గురిలో ఒకరు చంద్రబాబునాయుడు. మరి మిగిలిన నలుగురు ఎంఎల్ఏలు ఎవరు ? ఎవరంటే అచ్చెన్నాయుడు, బుచ్చయ్య, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, ఆదిరెడ్డి భవాని అనే పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఏది నిజమో  బుచ్చయ్యకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: