పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.NRS హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందాడు.అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆ వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ భావించిన మృతుడి బంధువులు వైద్యులపై,ఆసుపత్రి పై దాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన డాక్టర్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు.తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించాలని సమ్మెకు దిగారు.

దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్లకు సమ్మె విరమించాలని అల్టిమేటం జారీ చేశారు.SSKM హాస్పిటల్ ను సందర్శించి గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సమ్మెను విరమించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు.దీనిపై డాక్టర్లు గవర్నర్ను కలిసి తమకు భద్రత కల్పించవలసిందిగా కోరారు.

గవర్నర్ ఈ విషయంపై అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు.దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. BJP కావాలనే డాక్టర్లను రెచ్చగొట్టి సమ్మెను కొనసాగించేటట్లు చేస్తుందని మమత ఆరోపిస్తున్నారు. బిజెపి నేత ముకుల్ రాయ్ టిఎంసి పై తీవ్ర ఆరోపణలు చేశారు.మమతా దోషులను తమ సానుభూతి ఓటర్లుగా భావిస్తుంది,అందుకే వారిని పట్టుకోవడం లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

మమతా బెనర్జీ కూడా తీవ్ర స్థాయిలో బీజేపీ పై మాటల దాడి చేశారు.BJP అధ్యక్షుడు అమిత్ షానే వెనక ఉండి సమ్మెను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
డాక్టర్ల సమ్మెకు మద్దతుగా శుక్రవారం AIIMS డాక్టర్లు కూడా సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది. మమతా బెనర్జీ రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీనియర్ డాక్టర్లను లేఖలో కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: