ఏ ముహూర్తాన ఫిరాయింపులపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడారో వెంటనే చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైపోయింది. తాను ఊ అంటే టిడిపిలో నుండి తమ పార్టీలోకి దూకేయటానికి కొందరు ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నారని జగన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి చంద్రబాబులో ఆందోళన మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మంత్రి పదవులు ఇస్తానని చెప్పినా, లేకపోతే  ఫిరాయింపులను ప్రోత్సహించినా 8 మంది ఎంఎల్ఏలు వైసిపిలో చేరటానికి రెడీగా ఉన్నారంటూ చంద్రబాబుపై జగన్ పెద్ద బాంబునే వేశారు. తాను ఆ పనిచేస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని సూటిగానే జగన్ చెప్పారు.

 

జగన్ ఆ మాట బాహాటంగా చెప్పగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. వెంటనే తన పార్టీలో నుండి వైసిపిలో చేరటానికి రెడీగా ఉన్న ఎంఎల్ఏలెవరనే విషయంపై  ఆరాలు తీయటం మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. అందులో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే 11 మందున్నారు. వైసిపి ఎంఎల్ఏ కోటమరెడ్డి శ్రీధరరెడ్డి ప్రకారం 8 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంఎల్సీలు వైసిపితో టచ్ లో ఉన్నారట.

 

కమ్మ ఎంఎల్ఏలు 11 మంది పోను మిటిలిన 12 మందిలో ఎవరైనా వైసిపి వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు చంద్రబాబులో మొదలయ్యాయి. తన సామాజికవర్గం ఎంఎల్ఏలెవరూ వైసిపిలోకి వెళ్ళరన్నది చంద్రబాబు ధీమా. అందుకనే మిగిలిన 12 మంది ఎంఎల్ఏల కదలికలపై పార్టీ పరంగా నిఘా ఉంచినట్లు సమాచారం.

 

అయినా చంద్రబాబు పిచ్చిగానీ తమకు టిడిపి ఎంఎల్ఏల మద్దతు అవసరం లేదని ఒకవైపు జగన్ చెబుతుంటే ఇంకా వైసిపితో టచ్ లో ఉండే తమ ఎంఎల్ఏలపై నిఘా ఉంచటంలో అర్ధం లేదు. చంద్రబాబుకు ఏదైనా షాక్ తగిలితే అది బిజెపి నుండే తగలాలి. ఎందుకంటే, చాపక్రింద నీరులాగ బిజెపి నేతలే టిడిపి ఎంఎల్ఏలు, ఎంపి, మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి ఏదో ఓ రూపంలో చంద్రబాబుకు షాక్ తగలటమైదే ఖాయమైని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: