ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బాబు గారి అహంకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. చేతిలో అధికారం  ఉంది కదా అని అడ్డగోలుగా ప్రవర్తించారు. ఇప్పుడు పరిస్థితి ధీనంగా తయారైంది.వాస్తవానికి ఇలాంటి దారుణమైన ఓటమి తర్వాత బాబు ప్రతిపక్ష నేతగా మరొకర్ని ఎంపిక చేసి తాను సమావేశాలకు దూరంగా ఉంటారని అందరూ అనుకున్నారు. అలా చేయాలంటే ఆ పదవి బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది.


కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు నేతగా ఓ బీసీకి పదవి అప్పగించడానికి పచ్చబ్యాచ్ మనసు ఒప్పుకోలేదు, తమ సామాజిక వర్గానికే ఇస్తే విమర్శలు మరింత ఎక్కువవుతాయని మనసు చంపుకుని అసెంబ్లీకి వస్తున్నారు బాబు. అయితే ఇక్కడ జరుగుతున్న, జరగబోయే పరిణామాలు చూస్తుంటే బాబుకి చుక్కలు కనపడుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ రేంజ్ లో బాబుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మీ మామ నీ గురించి ఏమన్నారో వీడియో చూపించమంటారా అంటూ బాబుని ఉలిక్కిపడేలా చేశారు. దీంతో అసలు చంద్రబాబుకి సభలో ఉండాలా, బైటకు వెళ్లిపోవాలా అర్థంకాక నిశ్చేష్టుడై నిలబడిపోయారు.


గతంలో వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తే.. అదేదో ప్రజాస్వామ్యానికి ప్రమాదమంటూ ఎద్దేవా చేశారు బాబు. అసెంబ్లీకి రానివాళ్లకు జీతాలు ఎందుకంటూ సెటైర్లు వేశారు. మరిప్పుడు బాబు బైటకి వెళ్తే అవే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లోపల ఉండాలంటే.. జగన్ వ్యాఖ్యలకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. నిజానికి చంద్రబాబుకి అసెంబ్లీలో ఈ పరిస్థితి తప్పదని అంతా. కానీ ఇలా అసెంబ్లీ సమావేశాల రెండో రోజే బాబు ఇలా బుక్కయిపోతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతానికైతే బాబుది దిక్కుతోచని స్థితి. వాకౌట్ చేస్తే ఒక బాధ, సభలో ఉంటే మరో బాధ. నిండు సభలో నిందలు పడలేక కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నారు. కానీ తప్పదు, అనుభవించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: