రకుల్ ప్రీతి సింగ్ కెరీర్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపొయింది. అయితే తరువాత వరుసగా ప్లాప్స్ పలకరించడంతో కెరీర్ స్లో అయిపొయింది. అయితే సినిమాలు చేసేటపుడు ఎంత కష్ట పడ్డామనే విషయాన్ని ఎవరూ గుర్తించకుండా కేవలం జయాపజయాల ఆధారంగా ఓ హీరోయిన్‌ని జడ్జ్ చేయడం చాలా దురదృష్టకరం అని రకుల్ అంటోంది.


గ్లామర్ ప్రపంచంలో విజయాలు వరించడం, అపజయాల బారిన పడటం సాధారణమే అని.. వాటి ప్రకారం హీరోయిన్ టాలెంట్ అంచనా వేయడం సరికాదని చెప్పుకొచ్చింది రకుల్. హీరోయిన్ అన్నాక కెమెరా ముందు కంటే కెమెరా వెనుక చేయాల్సిన పనులు చాలా ఉంటాయని తెలిపింది రకుల్. నిజ జీవితంలో డైట్ విష‌యంలో, వ్యాయామం విష‌యంలో చాలా కఠినంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి.


ఇది కేవలం నా విషయంలో మాత్రమే కాదు మిగితా అందరు హీరోయిన్లదీ ఇదే పరిస్థితి అని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. సినిమా విజయం అనేది మనం ఊహించేది కాదు. ఎంత కష్టపడి చేసినా ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అంతమాత్రాన హీరోయిన్ కష్టం లేదని, ఆమె ఫెయిల్యూర్ అని అనుకోవడం పొరపాటు. జయాపజయాలనే కొలమానంగా తీసుకోవడం మానేసి హీరోయిన్ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది'' అని రకుల్ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: