ఏపీ అసెంబ్లీ తొలి స‌మావేశాల్లోనే చాలా సంచ‌ల‌న సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. వాస్త‌వానికి తొలి స‌మావేశాల్లో పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ విశేషాలు ఉండ‌వ‌ని అనుకున్న అంచ‌నాల‌కు భిన్నంగా తొలి స‌మావేశాల్లో అధికార ప‌క్షం,విప‌క్షం మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజులో జ‌రిగింది. స్పీక‌ర్ ఎంపిక ప్ర‌క్రియ‌పైనే ఇరు ప‌క్షాల‌కు బాగా వాదులాట‌కు దిగాయి. ఇదిలా ఉంటే జ‌న‌సేన‌కు అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వ‌ర‌ప్ర‌సాద్ శుక్ర‌వారం అసెంబ్లీ లాబీ బ‌య‌ట మీడియాతో మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు. 


ముందుగా ఈ రోజు జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై మాట్లాడిన రాపాక గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం విన‌డానికి వ‌ర‌కు బాగానే ఉంద‌ని.. ఇవి అమ‌లు చేస్తేనే అప్పుడు నిజంగా కూడా బాగుంటుంద‌ని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కి సునామీ లాంటి గెలుపుని అందించారని... జగన్ ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే పనిచేయాలని సూచించారు. నవరత్నాల అమలుకు సంబంధించి నిధులు ఎలా ? వస్తాయో చెప్పాలన్న రాపాక జగన్ ప్రస్తుతానికి చాలా బాగా పనిచేస్తున్నారని అన్నారు. 


జ‌గ‌న్‌ది చిన్న వయసు కావడంతో చాలా దూకుడుగా ముందుకు వెళుతున్నారని... ఈ దూకుడు మంచిదని కూడా ఆయన జ‌గ‌న్‌కు కితాబు ఇచ్చారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ఆయనకు రాజకీయంగా మరింత భవిష్యత్తు ఉంటుందని కూడా ఆకాంక్షించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను కుర్చీలో కూర్చోబెట్టడం చాలా చిన్న విషయం అని... దానిని అనవసరంగా రాద్ధాంతం చేయడం తగదని అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: