ఏపీ ఎన్నికల‌కు ముందు తమ టీడీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని నాటి సీఎం చంద్రబాబుకు అర్థమైంది. తాను తన, కొడుకు లోకేష్‌తో పాటు మంత్రుల అవినీతి, జన్మభూమి కమిటీల లంచగొండితనం వెరసి వచ్చే ఎన్నికల ఓటమి తప్పదని భావించాడు. ఇక్కడే చంద్రబాబు తన జిత్తులమారి తెలివితేటలతో ఓ ఎత్తు వేశాడు.  ఎన్నికల కోడ్‌ సరిగ్గా రెండు మూడు రోజులు ఉందనగా...కొత్తగా పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాలు తీసుకువచ్చాడు. సరిగ్గా పోలింగ్ రేపు కొద్ది రోజుల ముందు లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు జమయ్యేలా చేశాడు. దీంతో డబ్బులు అందుకున్న వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళలు తనకే ఓట్లేస్తారని చంద్రబాబు తెగ మురిసిపోయాడు. అయితే నాటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు, బీజేపీ, కమ్యూనిస్టులు, మేధావులంతా చంద్రబాబు ప్రజల డబ్బులతోనే అధికారికంగా ఓట్లు కొంటున్నాడని విమర్శించారు. 


అయితే చంద్రబాబు ఎత్తులు ప్రజల విజ్ఞత ముందు ఓడిపోయాయి. తమ డబ్బులే తీసుకుని, వాటితోనే సంక్షేమ పథకాల పేరుతో చంద్రబాబు ఓట్లు కొంటున్నాడని గ్రహించిన ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారు. అయితే చంద్రబాబు చివరి నిమిషంలో ప్రజలకు ఇచ్చిన తాయిలాలు ఆయనకే రివర్స్ అయ్యాయి. అయితే ఇప్పటికీ ఎన్నికల ముందు తీసుకువచ్చిన పథకాలపై, అధికారం కోసం ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉంది...


తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై  ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్‌ కుమార్‌ కోరారు.  దీంతో చంద్రబాబు నాయుడు కావాలనే ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కొనుగోలు కోసం పసుపుకుంకుమ లాంటి పథకాలను ఎన్నికల ముందుకు తీసుకువచ్చాడనే భావన ఇప్పుడు ఆయనపై హైకోర్టులో కేసు వేసేందుకు కారణమైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ కేసులో న్యాయమూర్తులు విచక్షణతో విచారణ జరిపితే చంద్రబాబు దోషిగా చట్టం ముందు నిలబడే అవకాశం ఉంది. మరి హైకోర్టు ఈ కేసుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: