- మేలైన ఆహారంతో రోగాలు దూరం
- యోగా హైందవ సాంప్రదాయంకాదు
- కుల మతాలకు అతీతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఆరోగ్య మార్గం యోగా
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కాకినాడ రెడ్‌క్రాస్‌ సొసైటీ యోగా కేంద్రం అధ్యాపకులు బోది నాగరాజు సూచించారు. కాకినాడ రాజాట్యాంకు (కుళాయి చెరువు) ఆవరణలోని రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా ఆయన యోగా బోదిస్తున్నారు. వందలాది మంది యోగాభ్యాసన ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటున్నారని ఆయన చెబుతున్నారు. యోగాతో పాటుగా మేలైన ఆహార నియమాలను విధిగా పాటించాలని ఆయన సూచిస్తున్నారు. యోగా ప్రాముఖ్యతను ఆయన మాటల్లో విందాం....


ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి కాపాడుకోవాలంటే అనేక రకాల ఆరోగ్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాయామం, పలు రకాల ఆసనాలు ఉన్నప్పటికీ అవి కొంతవరకూ ఉపశమనాన్ని ఇస్తాయి తప్పా పూర్తిస్తాయి ఆరోగ్యాన్ని సమకూర్చవు. కానీ యోగసాధన శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుంది. 


మన పూర్వికులు మనకు  యోగా అనే గొప్ప శాస్త్రాన్ని అందించారు. యోగాలోని ఆసనాలు శారీరకంగా అన్ని అవయవాలను చురుగ్గా ఉండేట్టు చేస్తాయి. అందులో ముఖ్యంగా ప్రాణాయామా అనే ఆశనం మన శ్వాస సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఈ ప్రాణాయామ ద్వారా శ్వాస సంభందిత సమస్యలు తగ్గటమే కాకుండా, శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. 


అదేవిధంగా మెడిటేషన్‌ (ధ్యానం) ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడే సాధనం. ప్రస్తుత తరుణంలో ఈ మెడిటేషన్‌ యువతకు చాలా అవసరం. ఎందువల్లనంటే అనేక మంది వారివారి వ్యక్తిగత కారణాలు, కుటుంభ కలహాలు, పరీక్షలు, ఉద్యోగం తదితర కారణాలతో డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఈ క్రమంలో వారు అధిక ఒత్తిడికి లోనై వారు నిగ్రహణా శక్తిని కోల్పోతున్నారు. పర్యవసానంగా ప్రాణాలు బలవంతంగా పొగొట్టుకుంటున్నారు. 


ఈ సమస్యల నుంచి పిల్లలు బయటపడేందుకు, అటువంటి ఆలోచనలు వచ్చినా నిగ్రహణా శక్తిని కోల్పోకుండా ఉండేందుకు మెడిటేషన్‌ చాలా దోహదం చేస్తుంది.  అందువల్ల ప్రతి ఒక్కరు తమ పిల్లలను యోగాకు పంపించటంగాని, తీసుకురావటంగాని చేయాలి. పిల్లలు యువత మానసిక స్థితిని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. 


యోగ ఆశన క్రియలలో శరీర అంతః శుద్ది ప్రక్రియ కూడా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు యోగాతో మనసుని, శరీరాన్ని ఎప్పటికప్పడు శుద్ది చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. భారత దేశంలో పుట్టిన యోగా ఇతర దేశాల్లో ఎక్కువగా ఆదరణ పొందుతోంది. యోగా అనేది హైందవ సాంప్రదాయమని కొందరు భావిస్తుంటారు. అయితే ఆ భావన సరైందికాదు. ప్రస్తుత తరుణంలో యోగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికి ఒక కులంతోగాని, మతంతోగాని సంభందంలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: