రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తీసుకువస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్‌ జనగ్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. తాడేపల్లి మండలంలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ బిడ్డల చదువుల కోసం  తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్నారు. పాదయాత్ర లో విద్యార్థుల ఆత్మహత్యలు కళ్ళారా చూసానని, అటువంటి పరిస్ధితులు రాష్ట్రంగా ఎప్పుడూ పునరావృతం కాకూడదన్నారు. ఇంకా అనేక అంశాలను ఆయన ఈ విధంగా ప్రస్తావించారు. 


*వ్యవస్థలో సంపూర్ణ మార్పు తీసుకు వచ్చే ధృడ సంకల్పంతో ప్రతి తల్లి,అక్క,చెల్లికి ఆరోజే మాట ఇచ్చా* *ఆ మాటను నేడు నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది.*
*జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ఒక పండుగ దినం చేస్తా.*
*ప్రతి తల్లి చేతిలో రూ.15,000/-డబ్బులు చేతికి అందిస్తా.*
*భారతదేశంలో  2011 జనాభా లెక్కల ప్రకారం 26 % చదువు లేని వారు ఉంటే.. ఇక ఏపీలో  33% మందికి చదువు  లేనివారు ఉండటం బాధాకరం.*
విద్యార్థులు సరైన సమయంలో పుస్తకాలు, యూనిఫాం లు అందించడంలో  గత ప్రభుత్వం విఫలం.


*ప్రభుత్వ పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులు.*
*పాఠశాలల్లో త్రాగునీరు, బాత్రూంలు, ప్రహరి గోడలు, ఫర్నిచర్ లేక విద్యార్థులు,ఉపాధ్యాయుల ఇబ్బందులు.*
*పాఠశాలల్లో ఇలా ఉంటే తల్లిదండ్రులు పిల్లలను బడులకు ఎలా పంపిస్తారు.?*
*ప్రైవేట్ రంగంలో ఫీజులు చూస్తే షాక్ కొడుతున్నాయి.*
*నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు పాఠశాలల్లో ఎల్ కేజీకే రూ.20వేల పై చిలుకు ఫీజులు.*
రాష్ట్రంలో ఇటువంటి అన్యాయ పరిస్థితులను ఎదుర్కోవాలంటే తల్లిదండ్రులు బాగా కష్టపడాల్సిందే.


*రాష్ట్రంలో 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నింటి ప్రస్తుత  ఫోటోలు సేకరించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశా. రెండేళ్లలో వాటి రూపు రేఖలను మార్చే విధంగా  కృషి చేస్తా.*
*ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇస్తున్నా.*
*ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావాలి.*
*తెలుగు సబ్జెక్టును కంపల్సరీ చేస్తా.*
*మీ పిల్లలను బడులకు పంపించండి... ఆ పిల్లలకు మామగా నేను ఉన్నా... ప్రతి చెల్లికి నేను మాట ఇస్తున్నా...*



మరింత సమాచారం తెలుసుకోండి: