ఫిరాయింపులపై మాట్లాడే సమయంలో అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు నోరు లేవలేదు. అంతేకదా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఫిరాయింపుల విషయంలో  నీతిమాలిన రాజకీయానికి తెరలేపారు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను టిడిపిలోకి లాక్కుని ప్రజాస్వామ్యానికే తూట్లు పొడిచారు.

 

అందుకనే అసెంబ్లీలో ఫిరాయింపులపైన, తన చేష్టలపైన జగన్  డైరెక్టు ఎటాక్ చేసినా ఏమీ మాట్లాడలేకపోయారు చంద్రబాబు. నిజానికి జగన్ అన్నాడని కాదు కానీ ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టిడిపికి ప్రతిపక్ష హోదా దక్కదన్నది వాస్తవం. కానీ చంద్రబాబు చేసినట్లుగా తాను నీతిమాలిన రాజకీయాలు చేయబోనంటూ జగన్ డైరెక్టుగానే చంద్రబాబు మొహం మీదే చెప్పారు.

 

ఇక్కడే చంద్రబాబు ఓ విచిత్రమైన ప్రస్తావన తేవటం గమనార్హం. అదేమిటంటే గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు పాల్పడిన ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం దేశవ్యాప్తంగా చర్చలు జరగాలంటూ దీర్ఘాలు తీయటమే విడ్డూరంగా ఉంది. ఫిరాయింపులపై దేశవ్యాప్త చర్చ జరగాలని అన్నారే కానీ తాము చేసింది తప్పని మాత్రం చంద్రబాబు అండ్ కో అంగీకరించలేదు.

 

ఇక్కడే చంద్రబాబు ఆవువ్యాసం గుర్తుకొస్తోంది అందరికీ. వైసిపి తరపున ఎంతమంది ఫిరాయింపు రాజకీయాల గురించి ఆరోపణలు, విమర్శలు చేసినా చంద్రబాబు మాత్రం నోరిప్పలేకపోయారు.  చేసింది నీతిమాలిన పని కాబట్టి చంద్రబాబు నోరిప్పలేకపోయారు. దానికి తోడు సభలో వైసిపికి ఉన్న సంఖ్యా బలం రీత్యా చంద్రబాబు కానీ ఇతరులెవరైనా మాట్లాడినా అందరూ కలిసి వాయించేస్తారన్న భయం కూడా ఉందేమో ? అందుకనే నోరిప్పలేక పోయారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: