చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి బలం, బలహీనత ఆయనే.అధికారంలోకి వచ్చినప్పుడు నామమాత్రపు మంత్రులను పెట్టుకొని మొత్తం ఆయనే నడిపిస్తాడు.అందువల్లే ప్రస్తుతం టీడీపీలో రెండో శ్రేణి నాయకులు లేకుండా పోయారు.

ఒక వైపు టీడీపీ దారుణ ఓటమిని ఖాతాలో వేసుకోవడం మరోవైపు బాబు గారికి వయస్సు మీద పడుతుండడంతో టీడీపీ పగ్గాలను భుజాన వేసుకునే యువ నాయకులు ఎవరూ లేక టీడీపీ శ్రేణులకు దిగులు పట్టుకుంది.ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ పార్టీకి ప్రయోజనం కంటే కీడే ఎక్కువ చేస్తున్నారు.దానితో పార్టీకి లోకేష్ కాకుండా మరొక యువ నాయకుడు కావాలని టీడీపీ పార్టీ శ్రేణులు చర్చికుంటున్నారు.

ఇలాంటి సమయం లో టీడీపీని ఆదుకొగలిగింది. జూనియర్ ఎన్టీఆర్ అని పార్టీలోని కొందరు సీనియర్లు అంటున్నారట కాని ఎన్టీఆర్ పార్టీ పగ్గాలను చేపడితే లోకేష్ రాజకీయ కెరీర్ ఇక అయిపోయినట్లే మరి పార్టీ ప్రయోజనం కోసం బాబు గారు తన కొడుకు కెరీర్ ను ఫణంగా పెడుతారా అంటే కష్టమనే చెప్పాలి.మరి బాబు గారు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకొని పార్టీ ని ఆదుకొంటారో లేక ఎన్టీఆర్ పార్టీ పగ్గాలను చేప్పటి తన మామను ఎదిరిస్తారా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: