వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ పై అంతటా ఆసక్తి నెలకొంది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ వచ్చారు. ఆయన రెండు రోజుల పాటు హస్తినలోనే ఉంటారు. అక్కడ ఆయన కీలకమైన నాయకులని కలుసుకుంటారు. ఓ విధంగా జగన్ టూర్ మొత్తం ఏపీతో సహా అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై తమ డిమాండ్ ని షాకు జగన్ వివరించారు. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలంటే విభజన హామీల్లో అతి ముఖ్యమైన హోదాను తక్షణం ఇవ్వాలని జగన్ గట్టిగా కోరారు. ఈ విషయంలో ప్రధాని మోడీ మనసు మార్చాలని కూడా ఆయన షాకు సూచించినట్లుగా అనంతరం మీడియాతతో చెప్పారు.


తమ పార్టీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి బీజేపీ ఇస్తామని అనలేదని, తాము కూడా ఆ పదవి కోరలేదని జగన్ క్లారిటీగా చెప్పారు. ఏపీ ప్రయోజనాలకు మాత్రమే తాము కట్టుబడిఉన్నామని జగన్ పేర్కొన్నారు. ఇక రేపు జరగబోయే నీతి అయోగ్ మీటింగులో  తాను పాల్గొని ప్రత్యేక హోదా అంశంపై అక్కడ కూడా గళెమెత్తుతానని జగన్ చెప్పారు. మొత్తానికి ఢిలీలో హోదాపై జగన్ సీఎం  గా పోరు మొదలుపెట్టారని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: