జగన్ అధికారంలోకి వచ్చాక వరసగా పధకాలు ప్రవేశపెడుతూ సంచలనాలు సృష్టిస్తున్నాడు.  ఎవరికి అంతుచిక్కని ప్రయోగాలు చేస్తూ ఆహా ఓహో అనిపించుకుంటున్నాడు.  వైఎస్ పింఛన్, రైతు భరోసా, జర్నలిస్టులకు అనేక వరాలు, అమ్మ ఒడి వంటి పధకాలు ఇందులో ఉన్నాయి.  ఒక్కో సంక్షేమ పధకం అమలు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పక్కర్లేదు.  

ఎంతటి కష్టమైనా సరే... పధకాలను మాత్రం అమలు చేయాల్సిందే అని జగన్ ఇప్పటికే హుకుం జారీ చేశారు.  అయితే, ఈ పథకాలకు డబ్బు ఎలా వస్తుంది.. ఎక్కడి నుంచి వస్తుంది.. దీనికోసం జగన్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన కలప ఎర్రచందం.  ఈ ఎర్ర చందనం శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది.  

చాలామంది దొడ్డిదారిగుండా ఈ కలపను తరలించేవారు.  ఇలా తరలించే కలపను పోలీసులు పట్టుకొని గిడ్డంగులకు తరలించారు.  అక్కడ గిడ్డంగులలో వేలాది టన్నుల ఎర్రచందనం ఉంది.  దీనిని అమ్మకానికి పెడితే.. ప్రభుత్వానికి బోలెడు ఆదాయం వస్తుంది.  దీనిని ప్రభుత్వ పథకాలకు వినియోగించాలని జగన్ అనుకుంటున్నాడట.  

ఎర్ర చందనాన్ని అలా గిడ్డంగుల్లో వదిలేయడం వలన ఉపయోగం లేదని, అనవసరంగా వృధా అవుతుందని చెప్పి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అసలే పొదుపు, డబ్బు వినియోగం గురించి ఎక్కువగా మాట్లాడుతున్న జగన్, ఆదాయ మార్గాలపై కూడా కన్నేశారు.  ఇది మంచి పద్దతే.


మరింత సమాచారం తెలుసుకోండి: