గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది అనగా.. అనేక సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టారు.  ఈ పథకాలపై యాడ్స్ కూడా చేశారు.  ఎన్నికల సమయంలో తామేమి డబ్బు ఖర్చు చేయడం లేదని.. ప్రభుత్వ పధకాల కోసం ఉపయోగించిన డబ్బుతోనే పార్టీ అధికారంలోకి వస్తుందని బాబుగారు అప్పట్లో అన్నారు.  

బాబుగారు అప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి.  బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు.  ప్రభుత్వ పధకాలను పార్టీ కోసం ఉపయోగించుకున్నారని, ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన పథకాలకు సంబంధించిన డబ్బును చంద్రబాబు నాయుడు సొంత ఖాతాల నుంచి వసూలు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.  

ఈ వ్యక్తి వేసిన పిటిషన్ ను హైకోర్ట్ స్వీకరించింది.  సోమవారం దీనిపై విచారణ జరపనున్నది.  ఒకవేళ సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు, అతని పిటిషన్లో పేర్కొన్న విషయాలు నిజమని తేలితే.. బాబు ఇబ్బందుల్లో పడ్డట్టే అవుతుంది.  ఈ పథకాలపై పిటిషన్ దాఖలైంది అని తెలిసిన వెంటనే టిడిపి శ్రేణుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.  

ఒకవేళ ఈ కేసులో సదరు వ్యక్తి గెలిస్తే హైకోర్ట్ ఏమని తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నది.  సదరు వ్యక్తి చేత ఎవరు పిటిషన్ దాఖలు చేయించారు అనే విషయాలపై టిడిపి ఆరా తీస్తోంది.  అధికారంలో ఉన్న వైకాపా ప్రతీకారంగా ఇలా కోర్టులో కేసును దాఖలు చేయించిందా అనే అనుమానాలు ఉన్నాయి టిడిపి శ్రేణుల్లో.  


మరింత సమాచారం తెలుసుకోండి: