ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు  ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని చంద్రబాబు తాజాగా  కామెంట్ చేశారు.   రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినా  ప్రజలు తెలుగుదేశాన్ని ఎందుకు ఓడించారు అన్న విషయం అర్థం కావడం లేదని  చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

40 ఏళ్ల  సీనియర్ని అంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబు..   ఇలా విచిత్రంగా మాట్లాడటం  చూసి  రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.   మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయిందో  చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు.  ఇందుకే అంటూ  కారణాల జాబితా వెల్లడిస్తారు.

 

మరి చంద్రబాబు మాత్రం  తాము ఎందుకు  ఓడిపోయామో  అర్థం కావడం లేదంటూ  ఆస్కార్ అవార్డు స్థాయి నటన  కనబరుస్తున్నారు.    నిద్రపోయే వారిని లేపవచ్చు కానీ..  నిద్ర నటించే వారిని మాత్రం లేపటం చాలా కష్టం.  ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. 

 

రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం.  గెలిచినప్పుడు  వినమ్రత,  ఓడినప్పుడు ఆత్మపరిశీలన  చాలా అవసరం. చంద్రబాబు  తీరు చూస్తే మాత్రం  వాస్తవాలను  అంగీకరించేందుకు ఆయన ఎంతమాత్రం ఇష్టపడటం లేదు అన్నది అక్షరాలా నిజం.  ఆయన ఇంకెంతకాలం ఇలా  గజినీ లా ఉంటారన్నది  ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: