ఎవరైనా సరే రాజ్యాంగ బద్దంగా ఎంపికైన వ్యక్తుల విషయంలో మర్యాదగా ఉండాలి.  మర్యాదగా ప్రవర్తించాలి.  లేదంటే అభాసుపాలవ్వాల్సి వస్తుంది.  ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  బాబుగారు ఇలాంటి తప్పే అసెంబ్లీలో చేశారు.  స్పీకర్ ఎంపికైనపుడు అధికార, ప్రతిపక్ష నేతలు స్పీకర్ ను స్పీకర్ కుర్చీ వరకు తీసుకెళ్లి కూర్చోపెట్టాలి.  

అలా చేయడం మర్యాద.  వెళ్లి కూర్చోపెట్టి వస్తే సరిపోతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  బాబుగారు అలా  చేయకపోవడం వలన ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటే.. సభలో మాటలు పడాల్సి వచ్చింది.   మాటలు పడాల్సి వచ్చింది.  సభలో  ఉన్న వ్యక్తుల చేతనే   కాకుండా  బయటి వ్యక్తుల చేతులో కూడా మాటలు పడాల్సి వచ్చింది.  

సభా మర్యాదలు పాటించకపోవడంలో బాబుగారు దిట్ట అని, 2009లో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా ఎంపికైనపుడు బాబు ఇదే విధంగా చేశారని, ఆ తరువాత నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఎంపికైనపుడు బాబు వెళ్లి సీట్లో కూర్చోపెట్టారని, దానికి అర్ధం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  

నాదెండ్ల  మనోహర్ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బాబుగారు అలా చేశారని విమర్శిస్తున్నారు.  అక్కడితో ఆ విమర్శా ఆగడం లేదు.. నాదెండ్ల మనోహర్  తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: