ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీతో జ‌రిగే ముఖ్య‌మైన‌ స‌మావేశం విష‌యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో… ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు.అయితే, శ‌నివారం ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 

ఎన్నికల ఫలితాల తర్వాత జరుగునున్న మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల సీఎంలు తమ డిమాండ్లను, సూచనలను ప్రధాని ముందు ఉంచనున్నారు. గ్రామీణ ప్రాంతాలల్లో మౌళిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, తాగునీటీ సరఫరా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సహా కొన్ని రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్‌ ను వ్యతిరేకిస్తుండడంతో ప్రధాని మోదీ, దీనిపై వివరణ ఇవ్వనున్నారు.

 

 

ఇదిలాఉండ‌గా,  కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో…పలువురు ప్రముఖులను ఆహ్వనించాల్సి ఉండటం, రాష్ట్రంలోని పలు శాఖలపై కీలకమైన సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నందునే కేసీఆర్ నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్లడం లేదని సమాచారం.

 

 

 

మోదీ సర్కార్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్‌ ను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న  ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ ను ఏర్పాటు చేసింది. అయితే నీతి ఆయోగ్ ఎన్ని అంచాలు వేసినా, నివేదికలు సమర్పించినా…నీతి ఆయోగ్‌ కు ఎలాంటి ఆర్ధిక అధికారాలు లేకపోవడంతోనే..నీతి ఆయోగ వ్యవస్థను తాను వ్యతిరేకిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు. దీని స్థానంలో పూర్వం ఉన్న ప్రణాళిక సంఘమే రాష్ట్రాలకు, కేంద్రానికి సంధానకర్తగా మంచి పాత్రను పోషించిందని  ఈ సందర్భంగా ఆమె అన్నారు. మరోవైపు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల సీఎంలు మొదటిసారి నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: