పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు.  ఈ పోటీలో కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది.  ఆ ఒక్కటి కూడా రాజోలు నుంచి.  పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోవడంతో పాపం జనసేన పార్టీ ఇబ్బందుల్లో పడింది.  ఎన్నికలకు ముందు పవన్ ఛానల్ తీసుకున్నారు.  

కొంతమేర విజయం సాధిస్తే ఆ ఛానల్ నునిలబెట్టాలని, పత్రికను స్థాపించి  సొంతంగా నడపాలని అనుకున్నారు.  అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం  ఎందుకు అవుతుంది.  కాదుకదా.  రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తిరిగి సినిమాల్లోకి వెళ్లే సమస్య లేదు.  

రాజకీయాల్లో నే ఉంటాను. చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాటం చేస్తాను అని చెప్పిన పవన్.. ఇప్పుడు యు టర్న్ తీసుకోబోతున్నారని వినికిడి.  రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇవన్నీ షరా మామూలే.  పార్టీని నడిపించాలంటే మామూలు  విషయం కాదు.  డబ్బు కావాలి.  

ఇప్పుడు పవన్ దగ్గర అంత డబ్బు లేదు.  అందుకే పవన్  తిరిగి సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారు.  ఎన్నికలకు ముందు పవన్ ముగ్గురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు.  సినిమాలు చేస్తే వాళ్ళ ముగ్గురికి ముందుగా సినిమా చేయాలి.  కనీసం రెండు మూడు సినిమాలు చేసిన తరువాత పవన్ తిరిగి రాజకీయాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: