నిజామాబాద్ లో తెరాస కు తిరుగులేదు.  అలాంటిది నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.  కెసిఆర్ కూతురు ఆ నియోజకవర్గంలో ఓటమిపాలైంది.  దీనికి కారణం లేకపోలేదు.  దాదాపు 300 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.  ఇది కవితకు మైనస్ అయ్యింది.  రైతులు ఎవరు కూడా తెరాస పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.  

దీంతో బీజేపీ అక్కడ విజయం సాధించింది.  ఇప్పుడు ఇదే ఫార్ములా హుజుర్ నగర్లో కూడా అప్లై కాబోతున్నది.  దాదాపు 300 మంది బిసిలు, నిరుపేదలు హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు.  

హుజుర్ నగర్  నియోజక వర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పోటీ చేస్తున్నది.  అలాగే కవితను కూడా అక్కడి నుంచి పోటీకి దించాలని చూస్తున్నారు.  సో, ఇక్కడ కూడా బిసిలు ఇలా నామినేషన్ దాఖలు చేస్తే.. నాయకుల పరిస్థితి ఏంటి..నిజామాబాద్ లో జరిగిన ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా.  

రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు హుజుర్ నగర్ లో  ఆగిపోయిన పనులు చెకచెకా జరిగిపోవాలి.  లేదంటే కష్టం అవుతుంది.  మరలా 300 మంది పోటీకి దిగుతున్నారు అనే సరికి యావత్ భారతదేశం చూపులు ఈ నియోజక వర్గం  మీదనే ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: