టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌. నిశ్చ‌ల చిత్తానికి, అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డానికి ఆయ‌న నిద‌ర్శ నం. అయితే, ఆయ‌న గ‌డిచిన ఐదేళ్ల కాలం అధికారంలో ఉండ‌డంతో ఆయ‌న ప‌రిస్థితిపై పెద్ద‌గా ఎక్క‌డా క‌థ‌నాలు రాలేదు. కానీ, నేడు మాత్రం దీనికి భిన్న‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు ఆయ‌న పార్టీని, ప్ర‌తిప‌క్షాన్ని ఎలా నెట్టుకు వ‌స్తారు ? అనేది కీల‌క అంశం. రాష్ట్రంలో యువ‌కుడైన సీఎం జ‌గ‌న్ ఉండ‌డం, ఆయ‌న చేస్తున్న ప‌నులు, ప్ర‌జ‌ల ను ఆక‌ర్షిస్తున్న వైసీపీ ప‌థ‌కాలు వంటివి పెద్ద ఎత్తున టీడీపీకి అశ‌నిపాతంగా మారాయి. దీనికితోడు.. తాజాగా అసెంబ్లీలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా చంద్ర‌బాబుకు కంటిపై కునుకు లేకుండా చేసింది. 


తన పార్టీకి చెందిన 23 మందిని సంతలో పశువుల మాదిరి కొనేసిన దానికి బదులు తీర్చుకోవటానికి జగన్ ఏ మాత్రం సంశయించటం లేదు. అంతేకాదు.. తాను ఎమ్మెల్యేల్ని లాగేయనని.. ఒకవేళ ఎవరైనా వస్తే.. వారిని రాజీనామా చేయించి న తర్వాతే తాను పార్టీలోకి తీసుకుంటానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఇమేజ్ ఎంతన్నది తెలిసిందే. ఇలాంటి వేళలో.. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు తాము రాజీనామా చేసి వస్తామని.. తమకు నామినేట్ పోస్టులు ఇస్తే సరిపోతుందని జగన్ ను కోరితే.. ఆయన ఓకే అంటే.. టీడీపీ ఆస్తిత్వానికే ప్రమాదంగా మారుతుందని చెప్పాలి.


175 మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం తనకు ఉన్న వేళ.. అదనంగా ఎమ్మెల్యేల్ని తీసుకోవాల్సి న అవసరం జగన్ కు లేదు. తీసుకోవాల‌ని ఆయ‌న కూడా భావించ‌డం లేదు. కానీ, చంద్ర‌బాబు త‌న ప‌ట్ల గ‌త ఐదేళ్ల కాలంలో చూపించిన నిర్ల‌క్ష్యం ఇప్పుడు జ‌గ‌న్‌ను వెంటాడుతోంది. అస‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మా? అంటూ ఆయ‌న చేసిన ప్ర‌సంగాలు కూడా జ‌గ‌న్‌కు తెర‌లు తెర‌లు గా చెవుల్లో వినిపిస్తున్నాయి. త‌న‌ను ఓ నేర‌స్తుడిమాదిరిగా.. చూడ‌డం, ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేయ‌డం వంటివి చూస్తూ..కూడా ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్నివినియోగించుకోక పోతే ఎలా అని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఇది కార్య‌రూపం దాలిస్తే.. బాబుకు వ‌చ్చే ఐదేళ్ల‌లో కేవ‌లం 5కు మించి స‌భ్యులు మిగిలే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో.. చంద్ర‌బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: