ఒకప్పుడు వీరు హీరోలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తరువాత జీరో అయ్యారు.  అయితేనేం వీళ్ళను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది.  తలుపు తట్టి  లేపింది.  ఎమ్మెల్యేలుగా  వీరుపరాజయం పాలయ్యారు.  అలా ఓడినా వీళ్లకు అవకాశం కలిసొచ్చింది.  

ఓడిన ఎమ్మెల్యేలకు ఎంపీలుగా అవకాశం లభించింది.  పోటీ చేశారు.  విజయం సాధించారు.   ఎంపీలుగా పోటీ చేసి విజయం సాధించిన వీరికి అదృష్టం వరించింది.  ఇలా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఓటమి చెంది ఆ తరువాత ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కి కేంద్రంలో మంత్రి పదవి లభించింది.  

కిషన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమిపాలైన  రేవంత్ రెడ్డి... మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.  ఈ విజయంతో రేవంత్ రెడ్డి పరపతి పెరిగింది.  ఇప్పుడు ఈ ఎంపీ చూపులు బీజేపీ వైపు ఉన్నాయి.  రేవంత్ తో పాటు  ఎమ్మెల్యేగా ఓడిన కోమటి రెడ్డికి అదృష్టం కలిసి వచ్చింది.  

ఇదిలా ఉంటె, గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన ఓడిపోయినా  నామా నాగేశ్వరరావు.. తరువాత తెరాస లో చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.  నామా ఇప్పుడు ఆ పార్టీ పార్లమెంట్ నాయకుడిగా పదవిని అందుకున్నారు.  అదృష్టం అంటే ఇదే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: