ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది.  ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత పార్టీ మొదటిసారిగా విజయవాడలో మీటింగ్ ను ఏర్పాటు చేసింది.  ఈ మీటింగ్ లో టిడిపికి చెందిన నేతలు పాల్గొన్నారు.  ఓటమికి గల కారణాలు, భవిష్యత్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు.. ఎదుర్కోవలసిన సవాళ్లు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు.  

ఈ మీటింగ్ ముగిసిన అనంతరం బాలకృష్ణ చిన్నల్లుడు తన వంతుగా మీడియాతో మాట్లాడరు.  జగన్ పై ఏంటో నమ్మకంతో ప్రజలు 151 స్థానాల్లో గెలిపించారు.  జగన్ ముందు పెను సవాళ్లు ఉన్నాయి.  కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.  లోటు బడ్జెట్.. చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది.  జగన్ మంచిగా పాలన చేస్తే అభినందిస్తాం.  ఏదైనా తప్పు చేస్తే నిలదీస్తామని భరత్ చెప్పాడు.  

వైకాపాకు 151 సీట్లు వచ్చాయి అంటే ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం ఉన్నట్టే కదా.  లేకపోతె అన్ని సీట్లు ఎందుకు ఇస్తారు.  ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ... ప్రజలకోసమే పనిచేసే పార్టీ.. అనే నమ్మకం ప్రజల్లో ఉంటె టిడిపికి ఓటు వేసి గెలిపించే వారు కదా.  అలా జరగలేదు అంటే కారణం ఏంటి.. ప్రజల్లో నమ్మకం లేనట్టే కదా.  

వైకాపా గెలుపు గురించి అడిగినపుడు ఈ స్థానాల విషయం చెప్పకుండా.. మరోలా మాట్లాడి ఉంటె బాగుండేది. గెలిచిన స్థానాల విషయం ప్రస్తావించే సరికి వైకాపాను ఆకాశానికి ఎత్తినట్టుగా ఉన్నది.  అపోజిషన్ లో ఉన్న ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది అనే విషయాన్ని దాదాపుగా ప్రస్తావించదు.  భరత్ తెచ్చిన ఈ ప్రస్తావన ఇప్పుడు వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: