ఈ ఆర్థిక సంవత్సరం 2019 -20కి సంబంధించి ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా జూలై 5న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక ఒడిదుకుల నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రధాన సవాళ్లను ధీటుగా అధిగమించే విధంగా బడ్జెట్‌ కూర్పు ఉండాలని ఆర్థిక విశ్లేషకులు, పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రధాన సవాళ్లను అధిగమించి వృద్ధి బాటలో పయనించే విధంగా ప్రాధాన్యాలు ఉండాలని సలహాలిస్తున్నారు. ఆర్థిక వృద్ధి మందగ మనం, నిరుద్యోగం, నగదు కొరత, సన్నగిల్లిన కొనుగోళ్లు ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లని విశ్లేషిస్తున్నారు.

వీటితోపాటు వాణిజ్య యుద్ధ ఆందోళనలు,  క్రూడ్‌ ఆయిల్‌ ధరల భయాలు, దేశీయంగా ఉన్న ఇతర ఆర్థిక సమస్యను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించాలంటున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న తొలి మహిళ నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నుండడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. బడ్జెట్‌పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమవ్వడంతో ఆర్థిక వేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారులు, మదుపర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్న ప్రధాన సవాళ్లివే.. 

జీడీపీ వృద్ధిరేటుభారత జీడీపీ వృద్ధిరేటు శాతం కొంత కాలంగా మందగమనంలో పయనిస్తోంది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతానికి పతనమైందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐదేళ్ల కనిష్ఠా స్థాయిలో 6.8 శాతం జీడీపీ నమోదైంది. దీంతో అత్యంత వేగంగా జీడీపీ వృద్ధి రేటును నమోదు చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ వెనుకబడింది. చైనా తర్వాతి స్థానానికి దిగజారింది.క్షీణిస్తున్న కొనుగోళ్లుఆర్థిక వృద్ధి మందగమనంలో కొనసాగుతోందని,  గ్రామీణ ప్రాంతాల్లో క్షీణించిన కొనుగోళ్లే ప్రధాన కారణమని జూన్‌ 6న ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది.

ప్రైవేటు రంగంలో పెట్టుబడ్డులు తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గడం ఆందోళనకరమైన పరిణామమని పేర్కొంది. ఇదే విషయాన్ని ఆర్థిక విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. రానున్న నెలల్లో ఆర్థిక వృద్ధికి కొనుగోళ్ల డిమాండ్‌ పెరగడ అత్యంత కీలకమని అంచనావేస్తున్నారు. అమ్మకాలు తగ్గడంతో కారు ఉత్పత్తి కం పెనీలు అమ్మకాల అంచనాలను తగ్గించు కోవడం కొనుగోళ్ల క్షీణత తీవ్రతను తెలియజేస్తున్నాయి. మొండిబకాయిలునిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) లేదా మొండి బకాయిలు దేశంలోని బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ఉంది.

మూడులో రెండొంతులుగా ఉన్న 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు కలిపి మొత్తం రూ.11 లక్షల కోట్లు మొండి రుణాలు మొండి బకాయిల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నగదు కొరత దేశంలో నగదు కొరత సమస్య తీవ్రంగా ఉంది. నోట్ల రద్దు తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. చిరు వ్యాపారులతో నాన్‌ బ్యాకింగ్‌ రంగ సేవల సంస్థలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొం టున్నాయి. అయితే నగదు కొరతను తగ్గించేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

జూన్‌ ప్రారంభంలో సగటున రోజుకు రూ.66 వేల కోట్ల నగదు అందుబాటులో ఉందని జూన్‌ 6న ద్రవ్యపరపతి సమీక్షలో ప్రకటించింది. ఏప్రిల్‌, మే నెలల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. పరిస్థితిని అదుపు చేసేందుకు క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలకు మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ధిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. 2018లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ నగదు లోటు కారణంగా పతనావస్థకు చేరుకుంది. ఇలాంటి భయాందోళనలు, ఇతర సంస్థలపై పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ క్రెడిట్‌ రేటింగ్‌లు ఉపయోగపడతాయనే ఉద్దేశ్యంతో సెబీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: