2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్ర ప్రదేశ్లో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 2024 ఎన్నికల సమయానికి టీడీపీ పుంజుకోగలదా అంటే అనుమానమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీయార్ లాంటి నాయకుడు కావాలి అప్పుడు మాత్రమే టీడీపీ పార్టీ కొత్త ఉత్సాహంతో పని చేయగలదు

 

కానీ జూనియర్ ఎన్టీయార్ కు రాజకీయాల్లోకి రావడం ప్రస్తుతానికైతే ఇష్టం లేదు. వరుసగా ఐదు హిట్లతో తన ఫ్యాన్ బేస్ ను హిట్ పర్సెంటేజ్ ను పెంచుకుంటున్నాడు ఎన్టీయార్. భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా తన స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.ప్రస్తుతం ఎన్టీయార్ చేతిలో ఆర్ ఆర్ ఆర్ తరువాత ప్రశాంత్ నీల్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో ఎన్టీయార్ బాలీవుడ్, సాండిల్ వుడ్ కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి

 

కానీ టీడీపీకి తను అవసరమని భావిస్తే మద్దతు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎన్టీయార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం లేదు. కేవలం పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం మాత్రమే ఎన్టీయార్ చేయగలడు. మరి తెలుగుదేశం పార్టీ 2024 నాటికి ఎలా పుంజుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: