2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసారు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారు.ఆ పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు మరింత చేరువై 2004లో సీఎంగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన నారా చంద్రబాబు నాయుడు కూడా సీఎంగా గెలుపొందారు. ఇలా పాదయాత్రలు చేసిన వాళ్ళు పదవులు చేపట్టటం వల్ల ఈ సెంటిమెంట్ రాజకీయనాయకులు చాలా మంది ఫాలో అవుతున్నారు.

 

పాదయాత్ర చేస్తే సీఎం అవుతారనే సెంటిమెంట్ ఆంధ్ర ప్రదేశ్ వరకూ నిజమవుతూనే ఉంది. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంగా గెలిచారు. ఇప్పుడు తను కూడా పాదయాత్ర చేసి పార్టీ ని నిలబెట్టాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఇలా పాదయాత్ర చేయటం ద్వారా పార్టీని బలోపేతం చేసి 2024 ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు.

 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భాద్యతలు సోనియా గాంధీకి అప్పగించి వీలైనన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు రాహుల్ గాంధి. ఈ పాదయత్రతో ప్రజలకు చేరువ కావొచ్చని తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయొచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: