రాజకీయాలను అంచనా వేయడం అంత సులువైన పనికాదు.  ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్పడం, తెలుసుకోవడం చాలా కష్టం.  అందుకే ఎన్నికలకు ముందుగా పధకాలు ప్రవేశపెడుతూ.. వాటిని నానా తంటాలు పడి అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.  ఇక ఎన్నికల్లో లేదు చేయలేదు అని చెప్తూనే.. చాటుగా నోట్లు పంచుతూనే ఉంటారు.  
తెలంగాణాలో తెరాస పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన వెంటనే.. కేంద్రంలో చక్రం తిప్పడానికి ప్రయత్నించింది.  ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో పాటు.. కేంద్రం యొక్క ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.  బీజేపీకి తెలంగాణలో కాస్త పట్టు ఉంది.  దీనిని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్న సమయంలో కెసిఆర్ కేంద్రంలో చక్రం తిప్పాలని చూశారు.  
దీంతో బీజేపీ చూపులను తెలంగాణాపై ఫోకస్ చేసింది.  ఎలాగైనా నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఎత్తులు వేయడం స్టార్ట్ చేసింది.  మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉన్నది.  రెండు నుంచి మొదటి స్థానంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. 
ఇప్పుడు బీజేపీ ఇదే చేయబోతున్నది.  కాంగ్రెస్ పార్టీ ఎలాగో బలహీనంగా ఉన్నది కాబట్టి.. దాన్ని తొక్కడానికి అట్టే సమయం పట్టదు.  పైగా ఆ పార్టీనుంచి నేతలు జంప్ కావడానికి సిద్ధంగా ఉంటారు.  కాబట్టి వాళ్ళను బీజేపీ వైపుకు తిప్పుకోవడం పెద్ద విశేషం ఏమి కాదు.  ఇప్పుడు బీజేపీ చేయాల్సిందల్లా.. తెరాస ను ఎలా అధికమించాలి అనే.  మరి చూద్దాం ఎలా చేస్తారో..


మరింత సమాచారం తెలుసుకోండి: