14 సంవత్సరాలు సీఎంగా పరిపాలించాడు మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కానీ కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టే ప్రయత్నాలైతే చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల ఫలితాలు విడుదలకాకముందునుండే జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడతానని హామీ ఇచ్చారు.

 

ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనప్పటికీ , తన ప్రత్యర్థి పార్టీని స్థాపించిన నాయకుడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టాలనే మంచి నిర్ణయం తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పట్ల కృష్ణా జిల్లా వాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

కొంతమంది ప్రముఖులు వారి జిల్లాలకు చేసిన గొప్ప గొప్ప సేవలను బట్టి జిల్లాలకు వారి పేర్లను పెట్టి జీవితాంతం వారి సేవలు గుర్తు చేసుకునే విధంగా నామకరణం చేస్తారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైయస్సార్ కడప ఇప్పటికే ఇలా నామకరణం చేసారు. ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. అతి త్వరలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: