ఏపీలో 23 రోజుల క్రితం వరకు లోకేశ్ అంటే టీడీపీలో ఒక రకమైన భయం, మరో రకంగా భయంతో కూడిన గౌరవం. ఆ పార్టీ వాళ్లు కాబట్టి. కానీ రోజులు మారాయి. దాంతో పాటే ప్రభుత్వం కూడా మారింది. అధికార మార్పిడి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చింది. సీఎం పదవి చంద్రబాబు నుంచి జగన్ కు వచ్చింది. ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. మంత్రులుగా వైసీపీలో గెలిచిన వారు ఎన్నికయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి కుమారుడిగా లోకేశ్ కు ఆ పార్టీ నాయకులు భయపడ్డారు.. నిజమే, కానీ ఇప్పుడు ఇంత జరిగాక వైసీపీ నాయకులు అధికారం ఉండి కూడా లోకేశ్ అంటే భయపడిపోతున్నారు.


కారణమేంటో తెలుసా.. ఆయన మంత్రిగా పనిచేసిన ఛాంబర్ ను చూసి. లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సెక్రటేరియట్ లోని 5వ బ్లాక్ అంటే వైసీపీ మంత్రులు భయపడ్డారు. జీఏడీ అధికారులు పలువురు వైసీపీ మంత్రులకు ఆ చాంబర్ ను కేటాయించగా “మాకొద్దు ఆ చాంబర్” అని ఇద్దరు ముగ్గురు మంత్రులు తేల్చి చెప్పారు. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ చాంబర్ కేటాయించినప్పుడు మాత్రమే. ఆయనకు కేటాయించగా “నాకు ఆ చాంబర్ వద్దు అని కరాకండిగా చెప్పి నాకు మరో చాంబర్ కేటాయించండి” అని జీఏడీ అధికారులకు లేఖ కూడా రాశారు. ఈ విషయంలో ఆయన వాస్తు పండితులను కూడా తీసుకెళ్లి చూపించగా వాస్తు బాగోలేదని వద్దని చెప్పారట. దీంతో ఆయన జీఏడీ అధికారులకు లేఖ రాయగా వారు వేరే చాంబర్ ను కేటాయించారు. ఇప్పుడు లోకేశ్ చాంబర్ ను డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీ వాణికి కేటాయించారు.


ఈ రకంగా లోకేశ్ సొంత పార్టీవాళ్లనే కాకుండా వైసీపీ నాయకులను కూడా భయపెట్టినట్టైంది. అసలు ఈ చాంబర్ ను లోకేశ్ పై పడ్డ కామెడీ ముద్ర కారణంగా వద్దన్నారా, ఆయన ఓటమి పాలైనందుకు వద్దన్నారా అంటే అసలు కారణం ఏదీ చెప్పలేకుండా “లోకేశ్” అనే పేరు బలంతోనే వద్దన్నట్టు తయారైంది పరిస్థితి. అందుకే పెద్దిరెడ్డి వాస్తు సిద్దాంతుల వరకూ వెళ్లాల్సివచ్చింది. లోకేశ్ కు చంద్రబాబు కుమారుడిగా, మంత్రిగా కంటే కూడా ఆయనపై వచ్చిన పప్పు అనే ముద్ర, ప్రసంగాల్లో ఆయన కామెడీయే ఆయనను హైలైట్ చేశాయి.


దీంతో స్వతహాగానే ఆయన పాపులర్ అయ్యారు. ఆయన చాంబర్ కూడా చినబాబు చాంబర్ గా పాపులర్ అయింది. అంతవరకూ బాగానే ఉన్నా ఎప్పుడైతే ఎన్నికల్లో లోకేశ్ ఓటమిపాలయ్యారో అప్పటినుంచే ఆయనపై ఆలోచనలు పెరిగాయి. ఈ ఆలోచనలు వైసీపీ వారికి ఆయన చాంబర్ వద్దనేంతగా సెంటిమెంట్ గా ఫీలయ్యేవరకూ వెళ్లాయి. దీంతో కొత్తగా వచ్చిన మంత్రులకు ఇది లోకేశ్ చాంబర్ అనగానే ఓకే.. అనలేక ఇన్ని తంటాలు పడి కొంతమంది వేరే చాంబర్లు చూసుకోగా మరొకరికి ఈ చాంబర్ కేటాయింపు జరిగింది. నిజమే మరి.. జగన్ తాడేపల్లిలోని కొత్త ఇంటిలో గృహ ప్రవేశం జరిగిన కొన్ని రోజులకే ఆయన సీఎం అయిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి వాస్తు నమ్మకాల్ని నమ్మాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: