Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 10:20 pm IST

Menu &Sections

Search

ఆ ఎమ్మెల్యే విషయంలో బాబు చేయని ధైర్యం.. జగన్ చేశాడు..!!

ఆ ఎమ్మెల్యే విషయంలో బాబు చేయని ధైర్యం.. జగన్ చేశాడు..!!
ఆ ఎమ్మెల్యే విషయంలో బాబు చేయని ధైర్యం.. జగన్ చేశాడు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైకాపా తరపున గుడివాడ నుంచి విజయం సాధించిన కొడాలి నానికి నందమూరి కుటుంబం అంటే ఎంతటి గౌరవం ఉందొ చెప్పక్కర్లేదు.  ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో అయన కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు.  గుడివాడ నియోజక వర్గంలో కొడాలి నానికి తిరుగులేదు.  అయన చెప్పిందే అక్కడ జరుగుతుంది.  
ఎమ్మెల్యేగా నాని పోటీ చేస్తున్నప్పటి నుంచి ఆయనే ఎమ్మెల్యే.  జూనియర్ ఎన్టీఆర్ కు అనుంగ మిత్రుడు కొడాలి నాని.  ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేశారు.  అయితే, ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చేతుల్లోకి తీసుకున్న తరువాత కూడా కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు.  ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి అన్యాయం జరిగిందో అప్పుడే టిడిపికి రాజీనామా చేసి వైకాపాలో జాయిన్ అయ్యాడు.  
ఆ తరువాత జరిగిన ఉపఎన్నికల్లో వైకాపా తరపున నాని విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో సైతం నాని గుడివాడ నుంచి విజయం సాధించారు.  ప్రజల నేతగా, దమ్మున్న నేతగా నానికి పేరు ఉండటంతో వైకాపా ఆయనకు పౌరసరఫరాల శాఖా మంత్రి పదవిని కట్టబెట్టింది.  ఇది నిజంగా హర్షించదగ్గ విషయమే.  
అప్పట్లో పార్టీకి విధేయుడిగా ఉన్నా బాబు నానికి ఒక్క పదవిని కూడా ఇవ్వలేదు.  పైగా నానిని ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం మారిపోయింది. నానికి మంత్రి ఇస్తారని ఎవరు ఊహించలేదు.  ఊహించని విధంగా నానికి పదవి రావడంతో, వైకాపా నేతలు హర్షం వ్యక్తం చేసున్నారు.  చంద్రబాబు నాయుడు చేయని పనిని.. జగన్ చేసి చూపించాడని నేతలు అంటున్నారు.


andhra-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.