డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీ వణికి తృటిలో ప్రమాదం తప్పింది.  డిప్యూటీ సీఎం, మంత్రి హోదాలో ఆమె తొలిసారిగా విజయనగరం జిల్లాకు ఇవాళ వచ్చారు. జిల్లాలోని రాజాపులోవలో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. అయితే… ఆమెను కలవడానికి చాలామంది కార్యకర్తలు స్టేజీ పైకి ఎక్కడంతో స్టేజీ ఒకేసారి పక్కకు ఒరగింది.


దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనను కిందికి దించారు. అనంతరం స్టేజీ కూలిపోయింది. వెంటనే ఆమె అక్కడి నుంచి విజయనగరం వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, ఆమె భర్త కూడా పాల్గొన్నారు. వాళ్లు కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 


మొన్నటి ఏపీ ఎన్నికల్లో శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆమెకు ఎస్టీ హోదాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. 2014లో కూడా ఆమె వైఎస్సార్సీపీ నుంచి కురుపాం ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినేట్ లో అతి తక్కువ వయసున్న మంత్రిగా రికార్డు సృష్టించిందని చెప్పాలి. అయితే వేదిక ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: