జగన్ జగన్ జగన్...ఏ.పి లో ఎక్కడ చూసినా ఇదే పేరు.  జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చలు.  ఆహా అలా చేశాడు... ఓహో ఇలా చేశాడు.. ఇంకా ఎలా చేస్తుంటే బాగుంటుంది... ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై చర్చలు చేస్తున్నారు సామాన్య జనం.  సామాన్యులకు తెలియని విషయాలు... సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వున్నాయి.

వాటిలో మొదటిది సమస్య ప్లాస్టిక్.  ఇప్పుడు ప్రతి వస్తువు ప్లాస్టిక్కే.  ఏ వస్తువు కొన్నా, దాన్ని ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి ఇస్తున్నారు.  రైస్ దగ్గరినుండి, టీ వరకు అన్నీ.. అంతా ప్లాస్టిక్ మయమే.  20 ఏళ్ళ క్రితం, ఈ సమస్య చాలా తక్కువ ఉండేది.  ప్రతి ఒక్కరు తమ నిత్యావసరవస్తువులకు పేపర్, లేదంటే సొంతంగా ఇంటినుండి సంచి పట్టుకెళ్ళేవారు.  ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసి డోర్ డెలివరీ చేస్తున్నారు.

మనిషి యొక్క బద్దకాన్ని, ప్లాస్టిక్ ఇండస్ట్రీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి.  రోజుకు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్ధాలు డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు.  డంపింగ్ యార్డ్ లో వున్న ఈ ప్లాస్టిక్ ను తగలబెడితే దానివలన చుట్టుప్రక్కల వున్న చాలా మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది.  కాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం వుంది.

కాబట్టి జగన్ దీనిపై దూర దృష్టి పెట్టి రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తే.. వేల టన్నుల పొల్యూషన్ తగ్గిపోతుంది.  భూమిపై ఉష్ణతాపం తగ్గుతుంది.  ఫైనల్ గా చెప్పాలంటే... ఇకపై రాబోయే ఎన్నికల్లో జగన్ విజయం సాధించాలంటే, "ప్లాస్టిక్ వాడకం నిషేదాన్ని పక్కాగా అమలు చేస్తాము" అనే హామీ ఇస్తే.. పక్కాగా వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ తప్పకుండా గెలుస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: