ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన ఎలా ఉంటుందో కేవలం ప‌ది రోజుల్లో దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని జగన్ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడులే అని విమర్శలు చేసిన ప్రతిపక్షాల‌ విమర్శకుల నోళ్లు ప‌ది రోజుల్లోనే జగన్ మూయించేశాడు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్ పరిపాలన ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా జగన్ ఇప్పుడు యంగ్ ముఖ్యమంత్రిగా మీడియాలో హైలెట్ అవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తలపండిన నాయకులతోపాటు.... నేషనల్ మీడియా మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తోంది. 


ఇక ఏ ప్రత్యేక హోదా కోసం జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలను రాజీనామా చేయించారో, ఏ ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీపై అవిశ్రాంతంగా పోరాటం చేశారో, ఇప్పుడు అదే ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో మరో పోరాటానికి రెడీ అయ్యారు. జగన్ తన తాజా ఢిల్లీ పర్యటనలో తాను కలిసిన బీజేపీ పెద్దలు అందరి దగ్గర ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ?  దాని ఆవశ్యకతను చాటి చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ మోహన్ రెడ్డి పోరాటానికి అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా  పాజిటివ్ స్పందన వస్తోంది. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దగ్గర సైతం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.


ప్రత్యేక హోదాపై సీఎం హోదాలో ఢిల్లీలో జగన్ చేస్తున్న పోరాటాన్ని అప్పుడే పచ్చ మీడియా బ్యాచ్ తక్కువ చేసి చెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్ ఎన్డీయేలో చేరుతున్నారని.. అందుకే అమిత్ షా వైసీపీకి లోక్‌స‌భ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేశారని పచ్చ మీడియా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ బాగా ఊదరగొడుతోంది. దీంతో వెంటనే ఆయన జగన్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేశాడు. బిజెపితో దోస్తీ కడుతున్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పచ్చ మీడియా నోళ్లకు తాళం వేశాడు. ఏదేమైనా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం హోదాలో వెళ్లిన జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీని, తన కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేయడం ప్రశంసనీయం.


మరింత సమాచారం తెలుసుకోండి: