కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు.. మహాపురుషువుతారు.. అని ఓ సినీకవి ఎప్పుడో చెప్పాడు.  నిజమే కదా.. ఒకదాంట్లో సక్సెస్ కావాలని సంకల్పించుకొని దానికోసం అహర్నిశలు పనిచేస్తే.. తప్పకుండా సక్సెస్ అవుతాం.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  

కష్టపడటమే సక్సెస్ కు దారి.  వేరే మార్గం లేదు.  దొడ్డిదారిలో వెళ్లాలని ప్రయత్నిస్తే.. అక్కడే ఉండిపోతాం తప్పించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.  ఇంతపెద్ద ఉపోద్గాతం ఏంటి సామి అసలు విషయం చెప్పొచ్చుకదా అంటారా.. అక్కడికే వస్తున్నా.. 

గత ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా.. ఒక పార్టీలో సీటు దక్కించుకొని ఆ పార్టీ తరుపున బరిలో దిగాలన్నా.. కుప్పలుకుప్పలు డబ్బు ఉండాలి.  అవేమి అవసరం లేకుండా ఓ వ్యక్తి వైకాపాలో స్థానం సంపాదించుకున్నాడు.  జగన్ మనసుకు గెలుచుకున్నాడు.  

అతను ఎవరో కాదు... తోగూరు ఆర్థర్.  ఈయన ఓ పోలీస్ అధికారి.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ మార్షల్ గా పనిచేశారు.  అసెంబ్లీలో గొడవచేసిన వాళ్ళను బలవంతంగా బయటకు  తీసుకెళ్లే ఉద్యోగం అన్నమాట.  ఈ విధంగా జగన్ తో మంచి అనుబంధం ఏర్పడింది.  ఇంకేముంది.. ఆ అనుబంధాన్ని అలా కొనసాగిస్తూ.. నందికొట్కూరు ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం దక్కించుకున్నాడు.  ఆ పార్టీ తరఫున పోటీ చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అటు బాపట్ల నుంచి గెలిచిన వ్యక్తి కథ కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: