మోడీ అంటే మొండి అంటారు. ఆయన అనుకున్నదే చేస్తారు. ఆయన నిర్ణయాలను మార్చడం ఎవరి వల్లా కాదు. ఆయన అంతర్ముఖుడు అంటారు. తన ఆలోచనలు పెద్దగా ఎవరితోనూ పంచుకోరు. మోడీకి సన్నిహితుడు అని చెప్పాలంటే అమిత్ షా ఒకే ఒక్కరున్నారు. ఆయనకూ మోడీ పూర్తిగా అర్ధమవ్వరుగా. 


ఇక మోడీ వరసగా రెండవమారు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయన్ని  ఇప్పట్లో ఎవరూ కూడా కన్నెత్తి చూసే సాహసం చేయరన్నది పొలిటికల్ పండిట్స్ మాట. అటువంటి మోడీని నిలబెట్టేసారు ఏపీ యువ సీఎం జగన్.  ఆయన ముఖ్యమంత్రి అయి పట్టుమని పది రోజులు కాలేదు. నీతి ఆయోగ్ సదస్సులో చాన్స్ దొరికిందే చాలు అన్నట్లు  హోదా ఎందుకు ఇవ్వరంటూ దేశంలోని సీఎం లు మొత్తం చూస్తుండగా మోడీకి అడిగేశారు. ఓ విధంగా కడిగేశారు.


దెబ్బకు మోడీ మాట రాకుండా అలా చూస్తుండిపోయారు. తనకు ఎదురులేదని భావించిన పీఎం కి, ఇందిరాగాంధి తరువాత అంతటి శక్టివంతుడైన మోడీకి ఎదురునిలిచి అదురు బెదురు లేకుండా హోదా కావాలి. ఇవ్వాల్సిందేనని అండడంలోనే జగన్ డేరింగ్ కనబడుతోంది. మోడీ భుజం తట్టి షేక్ హ్యాండ్ ఇస్తే ఆగే కుర్ర సీఎం కాదిక్కడ. లెక్క తేలాల్సిందేనని పట్టుదలగా డిమాండ్ పెడుతున్న జగన్ తో మోడీకి ఇపుడు లడాయి పడుతోంది. మరి గెలుపెవరిదో.



మరింత సమాచారం తెలుసుకోండి: