జగన్మోహనరెడ్డి...అంటే జగం మొత్తం  సమ్మోహనమైపోతారన్నమాట. వైఎస్సార్ ముందే ఆలొచన చేసి ఆ పేరు పెట్టారా అనిపిస్తుంది. తండ్రిని మించిన సమ్మోహన శక్తి జగన్ సొంతం. జగం ఇపుడు జాతీయ స్థాయిలో మారు మోగుతున్న పేరు. దాంతో ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షణ అలా ఉంటోంది.


కన్నడ సీమలో      పొలిటికల్ గా తెగ  ఇక్కట్లు పడుతున్న సీఎం కుమారస్వామి. ఆయన జగన్ ఏపీ భవంలో ఉన్నారని తెలుసుకుని పరుగున వచ్చేశారు. నిజానికి జగన్ ఢిల్లీ టూర్లో ఎక్కే గడపా దిగే గడపా చంద్రబాబు లా చేయలేదు. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. కానీ ఆయన్ని కల్సుకోవడానికి కన్నడ సీఎం వచ్చేశారు. జగన్ తోనే విందారగించారు. 


అంతకు ముందు తన కుమారుడు నిఖిల్ గౌడాను కూడా అమరావతి పంపించి రాయబేరాలు షురూ చేసిన కన్నడ కుమారం ఇపుడు జగన్ అని కలవరిస్తున్నారు. ఇంతకీ కధ ఏంటంటే కన్నడ సీమలో ఉన్న రెడ్లను ఆకట్టుకుంటే సింగిల్ గా విక్టరీ కొట్టొచ్చు. రెడ్లకు ఐకాన్ గా జగన్ని పదే పదే కలుస్తూ వదల బొమ్మాళీ అంటోంది ఇందుకే. మరి మన బాస్ ఆ వైపు గా చూపు విసురుతారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: